Lady Gang: విజయవాడలో రెచ్చిపోయిన లేడీ గ్యాంగ్
- విజయవాడలోని చౌకీ సెంటర్ లో రెచ్చిపోయిన లేడీ గ్యాంగ్..
- శ్రీ లక్ష్మీ గణపతి కెమికల్స్ సహా పలు షాపుల్లో వరుస చోరీలు..
- సీసీ కెమెరాల్లో లేడీ గ్యాంగ్ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Gang: విజయవాడ నగరంలోని చౌకీ సెంటర్ పరిసరాల్లో లేడీ గ్యాంగ్ దోపిడీలతో స్థానిక వ్యాపారుల అవస్థలు పడుతున్నారు. అర్థరాత్రి సమయంలో ఈ గ్యాంగ్ వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ మార్కెట్ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తోంది. కాగా, గత కొన్ని రోజుల నుంచి శ్రీ లక్ష్మీ గణపతి కెమికల్స్ సహా సమీపంలోని పలు దుకాణాల్లో పెద్ద మొత్తంలో వస్తువులు కనిపించకుండా పోవడంతో వ్యాపారులు నష్టపోయారు. దుకాణంలో స్టాక్ తగ్గిపోవడాన్ని గమనించిన కెమికల్స్ షాప్ యజమాని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆశ్చర్యకర విషయాలు రికార్డు అయ్యాయి.
Read Also: Russia-WhatsApp: రష్యా సంచలన నిర్ణయం.. వాట్సాప్‌పై నిషేధం!
Also Read
- 53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
- Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
- Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
అయితే, సీసీ కెమెరాల్లో లేడీ గ్యాంగ్ సభ్యులు రాత్రివేళ దుకాణంలో చొరబడి దొంగతనం చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి. వెంటనే షాప్ యజమాని ఈ వీడియోలను ఆధారంగా చేసుకుని విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇక, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా లేడీ గ్యాంగ్ సభ్యుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. చౌకీ సెంటర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, వరుస దొంగతనాలకు కారణమైన గ్యాంగ్‌ను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారు.
తాజావార్తలు
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
-
New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!