వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. రూ. 25 కోట్లను చెక్కును సీఎం చంద్రబాబుకు అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ అందించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు.
బుడమేరు వరద బెజవాడను అతలాకుతలం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన విపత్తులాంటి విపత్తును గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఊహించని స్థాయిలో వరద రావడం.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. బుడమేరు కబ్జాల వల్ల విపత్తు సంభవించిందని ఆయన అన్నారు. మేం అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాక ముందే అతి పెద్ద విపత్తు వచ్చిందని సీఎం పేర్కొన్నారు.
Nara Lokesh: ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇల్లు పూర్తిగా నీట మునిగాయని, ఆస్తులు ధ్వంసం అయ్యాయని మంత్రి నారా లోకేష్ కు తమ ఆవేదన చెప్పుకున్నారు బాధితులు.. నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు బాధితులు. అలాగే ఆభరణాల తయారీ కోసం తాము ఇచ్చిన 630 గ్రాములు బంగారాన్ని, మంగళగిరిలో పనిచేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన, గో బెడ్ అనే వ్యక్తి అపహరించాడని.. బంగారంతో సహా పశ్చిమ బెంగాల్ పారిపోయాడని మంత్రి నారా…
YSRCP: వరద బాధితులకు 50వేల నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టింది వైఎస్సార్‌సీపీ పార్టీ. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 33 కార్పొరేషన్ లో ముంపుకు గురయ్యారని., బుడమేరు వరద ప్రభుత్వ అలసత్వంతో విజయవాడ ప్రజలు అవస్థలు పడ్డారని.. మూడు రోజులు వరద నీటిలో ఉండి ప్రజలు పెద్ద అవస్థలు వర్ణనాతీమని., మా పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. GHMC Office: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..…
Boats at Prakasam Barrage: వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్ ఆపరేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకి క్లిష్టంగా మారుతోంది. 7 రోజులుగా దశలవారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వగా ఇవాళ ప్రకాశం బ్యారేజి వద్ద బోట్ల తొలగింపుకు H బ్లాక్ విధానంలో మరోసారి ప్రయత్నం చేయనున్నారు…
విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కండ్రికలో మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరు వరద బాధిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.
విజయవాడలోని విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి కండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీతో పాటు బుడమేరు ప్రవహించే మార్గాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు..
వరద నీరు తగ్గటంతో ఇంటి నుంచి బయటకు భోజనాలు తెచ్చేందుకు వెళ్లిన నాగబాబు అనే యువకుడికి విద్యుత్ షాక్‌తో ప్రాణాలు విడిచాడు.. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వచ్చి సీపీఆర్ చేసినా నాగబాబు ప్రాణాలు కాపాడలేకపోయాడు.. రోడ్డుపై నీరు ఉండడంతో.. ఆ నీటి నుంచి ఎందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకునే దాటేందుకు ప్రయత్నించాడు నాగబాబు.. అయితే.. విద్యుత్ స్తంభానికి అప్పడికే కరెంట్ పాస్ అయి ఉందని.. స్తంభం పట్టుకున్న వెంటనే నాగబాబుకు షాక్…
వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్వో, వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో జరిగింది. వరదలు వచ్చినప్పటీ నుంచి ఫుడ్, కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినా.. సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో.. ఇదే విషయంపై వాగ్వివాదం జరగటంతో స్థానికుడిపై ఆగ్రహంతో వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది.