విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు నిన్న రాత్రి నుంచి మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గాఘాట్ నుంచి దేవస్ధానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకవైపు ఆదివారం సెలవు రోజు కావడంతో దుర్గమ్మ…
Amaravati Farmers : ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు రానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను రాజధాని గ్రామాల రైతులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి…
“అఖండ” భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘అఖండ’ హీరో బాలకృష్ణ సినిమా దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి తాజాగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్పందించారు. Read also : దుర్గమ్మ సేవలో బాలయ్య… ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ విధానంపై మాట్లాడుతూ “ఆ…
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలవుదీరిన కనకదుర్గమ్మను దర్శించేందుకు వెళుతున్న భక్తులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఇంద్రకీలాద్రి పలు ప్రాంతాల్లో పనులు చేపట్టనున్న నేపథ్యంలో.. ఘాట్‌రోడ్డుపై రాళ్లు జారిపడే అవకాశం ఉండటంతో కొండపైకి వచ్చే వాహనాలను ఆంక్షలు విధించారు. కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు అర్జున వీధి నుంచి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మూడు రోజుల పాటు పనులు కొనసాగనున్న క్రమంలో ఘాట్ రోడ్డుపైకి వాహనాల అనుమతించబడవని అధికారులు వెల్లడించారు. అలాగే కార్తీకమాసం సందర్భంగా దీపావళి…
ఈ నెలలో దేవి శరన్నవరాత్రోత్సవాలు విజయవాడ ఇంద్రాకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా జరిగాయి. తొమ్మది రోజలు అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దుర్గమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు అమ్మవారి హుండీ ఆదాయం రూ. 2.87 కోట్లు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బంగారం 546 గ్రాములు రాగ, 9.55 కిలోల…
బాలీవుడ్ నటుడు సోనూసూద్ విజయవాడ కనకదుర్గమ్మను వీక్షించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలకు అంకితమైన సేవతో దేశంలో బాగా పాపులర్ అయిన రియల్ హీరోను స్వాగతించడానికి గన్నవరం విమానాశ్రయానికి అనేక మంది అభిమానులు తరలి వచ్చారు. సోనూసూద్ వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి గురువారం ఇక్కడకు వచ్చారు. యుపిఎస్‌సి పరీక్షకు సిద్ధమవుతున్న శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ, విద్యావేత్తలతో పాటు సేవా కార్యకలాపాలను చేపట్టాలని సోను సూద్ సూచించారు. ప్రజలకు సేవ చేసే అలవాటును…