ఆదివారం రాత్రి అనకాపల్లిలో క్వారీ లారీ సృష్టించిన బీభత్సం పలు రైళ్లు రాకపోకలను తీవ్ర ప్రభావితం చేసింది. విజయరామరాజు పేట అండర్ పాస్ దగ్గర లారీ అదుపు తప్పి ఐరన్ గడ్డర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి రైల్వే ట్రాక్ అలైన్మెంట్ మారిపోయింది. దీంతో అదే సమయంలో బ్రిడ్జి దాటుతున్న గూడ్స్ రైలును చాకచక్యంగా లోకో పైలెట్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ దెబ్బతినడం, గూడ్స్ రైలు నిలిచిపోవడంతో విశాఖ-విజయవాడ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం…