(సెప్టెంబర్ 22న విజయబాపినీడు జయంతి)నలుగురు నడిచే బాటలో నడిస్తే మేలని చాలామంది భావన; మనమే కొత్త మార్గం చూపిస్తే బాగుంటుందని ఇంకొందరి ఆలోచన. రెండోరకం వారే ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటారు. నిర్మాత, దర్శకుడు విజయబాపినీడు ఆ రెండోరకానికి చెందినవారే. ఆయన ఏది చేసినా, అందులో వైవిధ్యం ఉండాలని తపించేవారు. రచయితగా, చిత్ర నిర్వాహకునిగా, నిర్మాతగా, దర్శకునిగా బాపినీడు సాగిన తీరు మరపురానిది. విజయబాపినీడు పేరు వినగానే సినీ ఫ్యాన్స్ కు ‘శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్’ చప్పున గుర్తుకు…