కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానాతో షాకిచ్చింది. విజయ్ రోల్స్ రాయిస్ గోస్ట్ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హీరో విజయ్ 2021లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, విజయ్ పిటిషన్ ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియమ్ తోసిపుచ్చారు.…
విజయ్ సోషల్ మీడియాలో పెద్దంతగా కనిపించడు. పబ్లిక్ ఫంక్షన్స్ కూ హాజరయ్యేది తక్కువే! ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రం అలా మెరుపులా మెరుస్తుంటాడు. కానీ అతని అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా కూడా అతని అభిమానులు ట్విట్టర్ స్పేస్ సెషన్ ఒకటి ఏర్పాటు చేసి, గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. విశేషం ఏమంటే… ఆ సెషన్ లో పలువురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. అందులో…
థియేటర్ల కలెక్షన్ల స్థానంలో ఇప్పుడు సోషల్ మీడియా రికార్డులు వచ్చి చేరాయి. లైక్స్, షేర్స్, ఫాలోవర్స్… సంఖ్యను ప్రదర్శిస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరైనా స్టార్ హీరో బర్త్ డే వస్తే… కామన్ డీపీ కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి అనేది చూడటం ఎక్కువైపోయింది. అలానే ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్ వీడియోస్ విడుదలైనప్పుడూ ఇదే తతంగం. తాజాగా విజయ్ ఫ్యాన్స్ అతని బర్త్ డే సందర్భంగా ఓ నయా రికార్డ్ ను…