TVK Chief Vijay : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. టీవీకే పార్టీ మానాడు కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తమిళనాడులో సింహం వేట మొదలైంది. ఇక నుంచి రణరంగమే జరుగుతుంది. తమిళనాడులోని ప్రతి ఇంటి డోర్ కొడుతాం. అందరినీ కలుపుకునిపోతాం. ఏ పార్టీతోనూ మేం చేతులు కలపం. ఒంటరిగానే పోరాడుతాం.…
జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్రం, కొన్ని రాష్ర్ట ప్రభుత్వాల మధ్య వివాదం సాగుతున్న విషయం విదితమే. తాజాగా వీటిని వ్యాతిరేకిస్తూ.. తమిళగ వెట్రి కళగం పార్టీ తీర్మానాలు చేసింది. శుక్రవారం తిరువన్మయూర్‌లో వియజ్ ఆధ్వర్యంలో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. ఈ సమావేశానికి హాజరైన విజయ్ ప్రసంగించారు.
కాన్ఫిడెంట్‌గా ఉండండి వచ్చే ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే)దే విజయం అని ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్ అన్నారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నై మామల్లపురంలో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు విజయ్, ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు.