కరూర్‌లో టివికే పార్టీ అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ ఘోర విషాదానికి దారితీసింది. ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి పెరిగింది. ప్రస్తుతం 58 మంది తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం సీఎం స్టాలిన్ గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, చనిపోయిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ప్రకటించారు. అలాగే తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు…