తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం “జన నాయగన్”. హెచ్ వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ విషయంలో చట్టపరమైన చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ విషయమై వివాదం తలెత్తి కోర్టు వరకు వెళ్లింది.…