విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. వరుస ప్లాప్స్ తో సతమత మవుతున్న విజయ్ కు ఈ విజయం ఎంతో కీలకం. జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన…
విజయ్ దేవరకొండకి ఎంతో అవసరమైన సక్సెస్‌ను అందిస్తూ, ‘కింగ్డమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.67 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఈ సినిమా టాలీవుడ్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీక్ డే అయినా గురువారం విడుదలైన ఈ సినిమా, ఫస్ట్ డేనే ఏకంగా రూ.39 కోట్లు వసూలు చేసింది. ఈ మెస్మరైజింగ్ ఓపెనింగ్ తర్వాత శుక్రవారం, శనివారాల్లో కూడా కలెక్షన్స్ తగ్గలేదు.…