తిరుమలలో ఫోటోలు దిగడంతో పాటు మాడవీధుల్లో చెప్పులతో నడవడంతో నయనతార దంపతులు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! ఆచారాలకు విరుద్ధంగా నయా దంపతులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ వర్గాలు సహా టీటీడీ పాలకమండలి సైతం మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే విఘ్నేశ్ శివన్ ముందుకొచ్చి, తమ ప్రవర్తనపై వివరణ ఇచ్చాడు. అలాగే క్షమాపణలు చెప్పాడు కూడా! ‘‘శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని అనుకున్నాం, కానీ కుదరని పక్షంలో చెన్నైలో వివాహం చేసుకున్నాం. వివాహం తర్వాత…