తెలుగు సినిమా స్వర్ణయుగానికి మెరుగులు దిద్దిన మహోన్నతులైన దర్శకుల్లో వీరమాచినేని మధుసూదనరావు అలియాస్ విక్టరీ మధసూదనరావు ఒకరు. ఆత్మబలం, గుడిగంటలు, కల్యాణమంటపం, లక్షాధికారి, భక్తతుకారం, పదండి ముందుకు, ఆరాధన, మనుషులు మారాలి, మల్లెపూవు, చక్రవాకం, వీరాభిమన్యు, రక్తసంబంధం, విక్రమ్, సామ్రాట్… ఇలా దాదాపు 71 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువ శాతం విజయాలను స్వంతం చేసుకుని విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న ప్రతిభాశాలి వి మధుసూదనరావు. 1923 జూన్ 14న జన్మించిన ఆయన ఈ ఏడాది వంద సంవత్సరాలు…