విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.. ఈ ప్రమాదంలో బోట్లు తగలడడంతో తీవ్ర నష్టం కలిగింది.. అయితే, బోట్ల యజమానులకు ఈ రోజు పరిహారం పంపిణీ చేశారు.. 49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేశారు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించి, ఆందోళన చేసి రైళ్ళకు నిప్పు పెట్టారు. అగ్నిపథ్ ను కేంద్రం వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అగ్నిపథ్ తో వారి కుటుంబాలు రోడ్డు పడతాయని మండిపడ్డారు. రెండు, మూడేళ్ల నుంచి ఆర్మీలో చేరేందుకు ఎదురు చూస్తుంటే అగ్నిపథ్ స్కీం తీసుకు వచ్చి కేంద్రం…
విశాఖ లోని అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్‌లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి 9 గంటల వరకు అన్ని డిపార్ట్మెంట్ లతో రివ్యూ నిర్వహించడం జరిగింది. అధికారులు, ఎక్స్ పర్ట్స్ అభిప్రాయాలు తీసుకోవాలని కోరామన్నారు మంత్రి అమర్ నాథ్. అసలు ఎక్కడ నుండి గ్యాస్ లీక్ అయిందో…
తిరుపతిలో చిన్నపిల్లల అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కిషోర్, సాయి శ్రీనివాస్, మునికుమార్ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. చిన్నపిల్లల అశ్లీల వీడియోలను డౌన్ లోడ్ చేసి, ఇతరులకు వీరు షేర్ చేసినట్టు గుర్తించాము. 31 అసభ్యకర వీడియోలను నిందితులు అప్ లోడ్ చేసారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాము. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు…