అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా… పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాల కోసం కొత్త ఛానల్‌ను ప్రారంభించింది కేంద్రం. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభా స్పకీర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ… సంసద్ టీవీని ప్రారంభించారు. ఇప్పటి వరకు లోక్‌సభ, రాజ్యసభ పేర్లతో రెండు ఛానల్స్ ఉండేవి. ఆ రెండింటినీ సంసద్ ఛానల్‌లో విలీనం చేశారు. దేశ పార్లమెంట్ వ్యవస్థలో సంసద్ టీవీ…ముఖ్యమైన చాప్టర్‌గా మిగిలిపోతుందన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృతస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సంసద్ టీవీని ప్రారంభించారు. ఈ టీవీలో ముఖ్యంగా 4 రకాలుగా ప్రసారమవుతాయి.. పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు.. పథకాలు, విధానాల అమలు, పాలన.. భారత దేశ చరిత్ర, సంస్కృతి.. సమకాలిక స్వభావంగల సమస్యలు, ఆసక్తులపై కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు.