IPL: క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఆయన ఉచితంగా ప్రసారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూవర్‌షిప్ కలిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల డిజిటల్ ప్రసార హక్కులను ఈసారి ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సంస్థ 2.7 బిలియన్ డాలర్లు చెల్లించింది.