ఆవును మనం గోమాతగా పూజిస్తాం. కర్ణాటకలో బంగారు గొలుసు మింగేసిందో ఆవు. దీంతో దాని యజమాని ఆపరేషన్ చేయించి ఆ గొలుసుని బయటకు తీయించాడు. కర్ణాటకలోని హీపనహళ్లిలో జరిగిన ఘటన వైరల్ అవుతోంది. అసలు ఆ గొలుసు ఎలా మాయమైంది. ఎలా కనిపెట్టారో చూద్దాం. ఉత్తర కర్ణాటకలోని సిర్సి తాలూకాలోని హీపనహళ్లిలో శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తికి నాలుగేళ్ల వయసున్న ఓ ఆవు, దూడ ఉన్నాయి. దీపావళి సందర్భంగా శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు గోపూజ నిర్వహించారు.…