ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను బాలకృష్ణ, వెంకటేశ్ ఇప్పటికే విడుదల చేయగా, తాజాగా వేణువులో చేరని గాలికి సంగీతం లేదు... అనే పాటను మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చెప్పారు. కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ స్వరరచన చేశారు. అనురాగ్ కులకర్ణి శ్రావ్యంగా…