స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ‘ఐకాన్’ చిత్రం ఉంటుందని ప్రకటించి ఇప్పటికే చాలా కాలం గడుస్తోంది. 2019లో మేకర్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటినుంచి దర్శకుడు వేణు శ్రీరామ్ బన్నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కారణాలేంటో తెలియదు గానీ ఇప్పటివరకు ‘ఐకాన్’ పట్టాలెక్కలేదు. బన్నీ ‘అలా వైకుంఠపురంలో’ తరువాత ‘ఐకాన్’ సెట్స్ పైకి వెళ్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు సరికదా…