”పెళ్లి సందD” ఈవెంట్ లో సందడి చేయనున్న చిరు, వెంకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. రోషన్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు శిష్యురాలు అయిన గౌరి రోనక్ కొత్త దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. ఇక శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకు సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడి ఈ నెల 15న అభిమానుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 10 హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెషన్ లో నిర్వహించనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వం చిరంజీవి, వెంకటేష్ లు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక రోషన్ తండ్రి శ్రీకాంత్ మాత్రం చిరంజీవిని సొంత అన్నయ లాగానే భావిస్తాడు. ఆయనతో కలిసి సినిమాల్లో నటించాడు కూడా.
Also Read
- Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
- Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
- Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. 'టాక్సిక్' తగ్గితేనే బెటర్!
- Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
రోషన్ పెళ్లి సందD నుండి ఇప్పటికే విడుదల అయిన పాటలు మంచి హిట్ అయ్యాయి. అయితే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత హీరోగా 1996లో వచ్చిన ‘పెళ్ళి సందడి’ సీమకు కూడా కీరవాణి నే సంగీతం అందించారు. ఆ పాటలను అభిమానులు ఇప్పటికి మర్చిపోలేదు. ఆ సినిమా అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లి సందD కి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటంతో ఈ సినిమా పై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూస్తుంటే ఆ పెళ్ళి సందడి శ్రీకాంత్ కెరీర్ లో ఓ మైలురాయిగా ఎలా నిలిచిపోయిందో… ఈ పెళ్లి సందD కూడా రోషన్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది అని అనిపిస్తుంది.
తాజావార్తలు
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?