పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం ఇవ్వనున్నారని ప్రకటించారు. గంగవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లకు ప్రభుత్వ డబ్బు జీతంగా ఇవ్వకూడదని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని.. ఈ 3 నెలలు ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తన సొంత డబ్బులతో జగన్ జీతం ఇస్తానని చెప్పారంటూ ఎమ్మెల్యే ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.…
నచ్చిన నేతకు నీరాజనం పలికే జనాలు.. తేడా వస్తే అదేస్థాయిలో నిలదీస్తారు. ఆ ఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగింది. ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో చర్చల్లోకి వచ్చారు ఆ అధికారపార్టీ శాసనసభ్యుడు. ఎవరా ఎమ్మెల్యే? ప్రజలు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న జనం?టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాల్లో రోజుకో రకంగా మారుతుంది. అలాంటి పరిస్థితినే చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నారట. సొంత పార్టీలోనే దీనిపై జోరుగా…
మా ఎమ్మెల్యే కనపడుట లేదు… ఇది ఆ నియోజకవర్గ ప్రజల మాట. మొదటి సారి బంపర్ మెజారిటీతో గెలిచిన ఆయన, నియోజకవర్గంలో మరీ నల్లపూసై పోయారట. అనుచరుల్ని వాకబు చేస్తే సారు చాలా బిజీ అంటున్నారట.. ఎవరికీ దొరకని యువ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మరి? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ …. యువ ఎమ్మెల్యే ..పలమనేరు నియోజకవర్గ చరిత్రలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి. తొలిసారి టికెట్ దక్కించుకుని, గత ఎన్నికలో…