Vaikunta Ekadasi: యాదాద్రికి పోటెత్తిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆలయాలు భక్తులు వేకువజామునుంచే పోటెత్తారు. దీంతో హరి నామస్మరణతో ఆలయాల్లో మారుమ్రోగుతున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కావడంతో భక్తి జనం పోటెత్తారు.
Also Read : Delhi: తీవ్ర విషాదం.. మహిళను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కార్..
6గంటల 48 నిమిషాలకు భక్తులకు శ్రీ లక్ష్మీనరసింహుడు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. అయితే.. ఉత్తర ద్వార దర్శనంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. అంతేకాకుండా.. వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. హరి హరులు ఉత్తర ద్వారం ద్వార భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు.. తొలుత ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి భక్తులకు దర్శనం కల్పించారు అర్చకులు, అధికారులు.
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
స్వామి వార్లకి మహా హారతి అనంతరమే కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి. జగిత్యాల జిల్లాలోన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. మంగళ వాయిద్య లతో, వేద మంత్రోచ్ఛారణల మధ్యన వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉత్తర ద్వారం గుండా స్వామి వార్లను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి దంపతులు దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా స్వామి వార్లను వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!