Operation Karag : రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, వేములనర్వ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పన్నెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న తమ గ్రామ యువతి విజయలక్ష్మి అలియాస్ భూమిక, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఆపరేషన్ కగార్’లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వార్తలు రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయలక్ష్మి ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే ఆమె ఉద్యమాలకు ఆకర్షితురాలై, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కుటుంబానికి దూరంగా, ఒక ఆశయంతో పయనించిన ఆమె జీవితం ఇలా…