ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Road Accident: ముంబైలోని ధారవి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న 6 కార్లను వేగంగా వచ్చిన ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనతో వాహనాలు కాలువలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రమాదం శుక్రవారం ఉదయం 6 గంటలకు జరిగింది. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కకు ఆపి వాటి యజమానులు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, తెల్లవారుజామున అదుపుతప్పి వేగంగా…