ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రికి ఓ జూనియర్ ఎమ్మెల్యే వర్గం చెక్ పెడుతోంది. 30 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ చూడని పరిణామాలు సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాలలు రగిలించాయ్. వర్గ రాజకీయాలతో విసిగెత్తిపోయిన ఆయన ఎక్కువ కాలం భరించడం కష్టం అనుకున్నారో ఏమో కానీ…కుండబద్దలు కొట్టేశారు. నాకు సీఎం తప్ప బాస్‌లు ఎవరూ లేరని బహిరంగంగానే ప్రకటించి సరికొత్త చర్చకు తెరతీశారు. విశాఖ జిల్లా అనకాపల్లి వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాజీ…