ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వరుణ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జూలై 28న విచారణ జరుపుతామని కర్ణాటక హైకోర్టు తెలిపింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో సమయం దగ్గర పడిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి నిరసన సెగ ఎదురవుతోంది. మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యతో తలపడనున్న బీజేపీ నేత వీ సోమన్నకు ఈరోజు ప్రచార పర్వంలో ఇబ్బంది ఎదురైంది.