ఏపీలో కల్తీ మద్యం ఘటనలే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుంభకోణంలో ఉన్న పెద్దలు అందరూ బయటకు రావాలని, టీడీపీకి నిజంగా సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ విచారణకు వెనకడుతుంది? అని ప్రశ్నించారు. కల్తీ మద్యానికి సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ నేతలే అని విమర్శించారు. కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా టీడీపీ నేతలు మార్చుకున్నారని, నారావారి…