ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలు చాలా సీరియస్ గా వున్నారు. గుడివాడ కేసినో పై చంద్రబాబుకి నివేదిక అందచేశారు. గుడివాడలో కేసినో నిర్వహణపై రూపొందించి సమగ్ర నివేదికను గవర్నరుకి అందచేస్తాం. గవర్నర్ రేపు, ఎల్లుండిలో సమయమిస్తే ఆయనకు క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తాం అన్నారు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర. క్యాసినో జరిగింది వాస్తవం, పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు…
గుడివాడ కేసినో వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఛీర్ గాళ్స్ ఇండిగో విమానంలో వచ్చారని, ఉత్తరాది మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. గుడివాడలో ఇటీవల కేసినో నిర్వహించారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో కొత్త ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. ఈ కేసినోలో చీర్ గాళ్స్ కూడా ఉన్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. కేసినోలో పాల్గొన్న చీర్ గాళ్స్ ప్రయాణ వివరాలను ఆయన…
మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య… కొడాలి నానికి తెలుగు నేర్పిన మాస్టర్ వస్తే కాళ్లకు దండం పెట్టాలని ఉందంటూ సెటైర్లు వేసిన ఆయన.. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత కేంద్రం చంద్రబాబుకి ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఇచ్చింది.. చంద్రబాబు దేశ సంపద కాబట్టి కేంద్రం ఎన్‌ఎస్‌జీతో రక్షణ కల్పించిందన్నారు.. కానీ, కొడాలి నానిని ఆడవాళ్లు కొట్టకుండా సీఎం జగన్ సెక్యూరిటీ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.. నారా భువనేశ్వరిపై…
చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ర్ట ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలోఎన్‌ఈసీ ఆదేశాలనుసారం అధికారులు నడవాలి కానీ, డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్‌ఈసీ ఎన్నికల నిబంధనలు ఏమైనా మార్చారా అంటూ ఆయన మండిపడ్డారు.…