ఏపీలో జగన్ పాలనపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. రాచరిక, పాలెగాళ్ల పాలనను తలపించేలా ప్రభుత్వయంత్రాంగం పరిధి దాటి వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలతోపాటు, తెలుగు జాతి గర్వించేలా వివిధ రంగాల ప్రముఖుల్ని సైతం జగన్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు వర్ల రామయ్య.
Read Also: Ravanasura: గ్యాప్ కు కారణం తెలియదు: సుశాంత్
తెలుగుజాతి గొప్పగా చెప్పుకునే పద్మవిభూషణ్ బిరుదాంకితుల్ని సైతం కుసంస్కారంతో, దొంగ కేసులు, తప్పుడు కేసులతో వేధిస్తూ, ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు.గత 9దశాబ్దాలుగా బ్రహ్మయ్య అండ్ కో సంస్థ ఏమచ్చ లేకుండా ఆడిట్ చేస్తుంటే, సంస్థకు చెందిన శ్రావణ్ ను కక్షతో తప్పుడు కేసులు బనాయిస్తారా..?అధికారంచేజారిపోతోందన్న దుగ్ధతో (ఫ్రస్టేషన్) జగన్ గంగవెర్రులెత్తి ప్రతిపక్షాలతో పాటు, సమాజంలోని ప్రముఖుల్ని కూడా దొంగకేసులతో అప్రదిష్ట పాలుచేస్తున్నాడు.ఈ ప్రభుత్వం కక్ష కార్పణ్యాలతో ‘ఫ్రొఫెషనల్స్’ పై కూడా దాడులుచేస్తూ, తప్పుడుకేసులు పెట్టడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు అన్నారు వర్ల రామయ్య.
Read Also: SSC Paper Leak: పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం.. కేసు నమోదు