ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి సింహగిరి ప్రదక్షిణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కొండ చుట్టూ 32 కి.మీ.మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు 4 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. వారికి ఇబ్బంది కలగకుండా అధికారులు పలు చోట్ల మంచినీరు, మెడికల్ క్యాంపులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3…