తరగని కళాతృష్ణ, చెరిగిపోని నటనాపిపాస వెరసి నటరత్న యన్.టి.రామారావు అని అంటే అతిశయోక్తి కాదు. తెరపై పట్టువదలని విక్రమార్కునిగా నటించిన యన్.టి.రామారావు నిజజీవితంలోనూ అదే తీరున సాగారు. ఓ సారి తలచుకుంటే, దానిని సాధించేదాకా నిదురపోని నైజం యన్టీఆర్ ది! ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం పరిఢవిల్లడానికి కారణమైన సమ్రాట్ అశోకుని పాత్ర పోషించాలన్న తలంపు యన్టీఆర్ మదిలో బ్రహ్మంగారి చరిత్ర చిత్రం రూపకల్పన సమయంలోనే నాటుకుంది. తరువాత రాజకీయ ప్రవేశం, ఆ తరువాత రాజకీయాల్లోనూ ఆయన జైత్రయాత్ర, ముఖ్యమంత్రిగా…
(ఏప్రిల్ 9తో ‘ఘరానామొగుడు’కు 30 ఏళ్ళు) మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు విజయదుందుభి మోగించాయి. అసలు చిరంజీవి కెరీర్ ను పరిశీలిస్తే రాఘవేంద్రరావు సినిమాలతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించినా, డాన్సులతో మంచి మార్కులు పోగేశారు. తరువాత యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘తిరుగులేని మనిషి’లోనూ ఓ కీలక పాత్రలో…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది.. వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. ఇప్పటికే ఇక్కడ్నుంచి రెండుసార్లు విక్టరీ కొట్టారు ఆర్కే రోజా. అయితే, పార్టీలోని అంతర్గత విభేదాలు ఎన్నో సార్లు గుప్పుమన్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజాపై ఆమె వ్యతిరేక వర్గం తిరుగుబాటు చేయడం చర్చగా మారింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం పోరు ఆసక్తిగా మారేలా కనిపిస్తోంది. ఎంతకంటే..? ఇప్పుడు…
టాలీవుడ్ లో మరో వారసురాలు ఎంట్రీ ఇచ్చేసింది. తనే వర్ష విశ్వనాథ్. నిన్నటి తరం హీరోయిన్ వాణీ విశ్వనాథ్ చెల్లెలు ప్రియా విశ్వనాథ్ కుమార్తె ఈమె. నటిగా వాణీ విశ్వనాథ్ కి ఎంతో గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విజయవంతమైన సినిమాలలో నటించిన వాణీ విశ్వనాథ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతోంది. కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఆమె ‘జయ జానకి నాయక’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ వారసురాలు…
ఒకప్పటి పాపులర్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వాణీ విశ్వనాథ్ కుటుంబం నుండి మరొకరు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె సోదరి కుమార్తె వర్షా విశ్వనాథ్ ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రమణ్ హీరోగా కె. శిరీషా రమణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం. రమేశ్, గోపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ మూవీలో పక్కింటి అమ్మాయిని తలపించే పాత్రను వర్ష చేస్తోందని, ప్రస్తుతం ఈ సినిమా…