బెజవాడ రాజకీయాలు…వంగవీటి రంగా చుట్టూ తిరుగుతున్నాయ్. ఆ ఘటన జరిగి మూడు దశాబ్దాలు గడిచినా…దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయ్. అవసరాన్ని బట్టి రంగా అంశాన్ని బయటికి తీసి…ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఇటీవల రంగా హత్యోదంతంపై ప్రత్యర్థులు…దేవినేని నెహ్రూను టార్గెట్ చేశారు. దీనిపై ఆయన తనయుడు దేవినేని అవినాష్…తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో దేవినేని కుటుంబాన్ని విలన్లుగా చూపుతూ రాసే కథనాలు.. చేసే కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఈ హెచ్చరికల ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు.…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖ వేదికగా జరుగుతోన్న కాపునాడు సభ చర్చగా మారింది.. అయితే, కాపునాడు సభకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా దూరంగా ఉన్నాయి.. జనసేన పార్టీ నేతలు మాత్రం హాజరుకాబోతున్నారు. దీంతో, ఈ సభలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.. వంగవీటి మోహనరంగ పోరాటం స్ఫూర్తిగా కార్యాచరణ ప్రకటించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు ప్రతినిధులు ఈ సభకు తరలివస్తున్నారు.. రాజకీయాలకు అతీతమే అని చెప్పినప్పటికీ..…
Kodali Nani: విజయవాడలో నున్న సెంటర్‌లో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, వంగవీటి రాధా పాల్గొన్నారు. వీళ్ల ముగ్గురూ ఒకే వేదికపైకి రావడంతో రాజకీయంగా ఆసక్తి రేగింది. ఈ సందర్భంగా వంగవీటి రంగాపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసమే రంగా జీవించారని.. నమ్మిన సిద్దాంతం కోసం రంగా ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ప్రజల గుండెల్లో రంగా ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారని కొడాలి…
విజయవాడ 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా. దీంతో శ్రీనగర్ కాలనీకి పెద్దఎత్తున చేరుకున్నారు వంగవీటి రంగా, రాధా అభిమానులు. భారీ ర్యాలీతో, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు అభిమానులు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు. నా తండ్రిని కులమతాలకతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. శ్రీనగర్ కాలనీలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు.రాష్ట్రం నలుమూలలా రంగా గారి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు.…
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది… విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్బ్యూర్ సభ్యులు బోండా ఉమ.. దీని కోసం ఆందోళనకు కూడా సిద్ధం అవుతున్నారు.. రేపు ధర్నా చౌక్ వద్ద రంగా పేరు పెట్టాలన్న డిమాండ్తో వేల మందితో ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు.. అవసరతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమన్నారు.. వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదన్న ఆయన.. రంగా వంటి…