ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో కాకరేపుతున్నాయి.. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు.. గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన రాధ రంగా రీ ఆర్గనైజేషన్ అధ‌్యక్షుడు గాదె బాలాజి.. అన్ని సామాజిక వర్గాల వారికి రంగా నాయకుడు.. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టుకపోవటం బాధాకరం అన్నారు.. రంగా పేరు పెట్టాలని అందరూ ఐకమత్యంతో కలిసి ముందుకొస్తున్నారన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.. రంగాకి వైఎస్ కి…
ఓ పెద్ద నాయకుడికి ఆయన వారసుడు. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విపక్షపార్టీలో ఉన్నా పెద్దగా చప్పుడు లేదు. కానీ.. తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసి.. ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఇంతకీ అది వ్యూహమా? నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందా? తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణపై బెజవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన పని తాను చేసుకుపోయే రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న.…