Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని కోర్టు దగ్గర వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ.. మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వంశీని న్యాయస్థానం నుంచి సబ్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. మూడు రోజులు పోలీసులు కస్టడీలో నా భర్తను అర్థం పర్థం లేని కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారు అని ఆరోపించింది.