చుట్టూ అందమైన పుష్పాలే.. స్వర్గానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తుంది ఆ ప్రదేశం. ఆ ప్రదేశమే ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్(పూల లోయ) జూన్ 1, 2024 నుండి పర్యాటకుల కోసం తెరవబడుతుంది. ఈ ఏడాది ఇది అక్టోబర్ 30 వరకు తెరిచి ఉంటుంది. పర్యాటకులు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎప్పుడైనా ఇక్కడకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.