ఖమేనీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు.. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్‌కు చేరుకున్నాయి. దీంతో భద్రతా దళాలు అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.…