ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు, ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక ఇష్టమైన వాటిని తింటారు. సరదాగా గుడుపుతారు. ఇలా ఈరోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతుంటారు.
ప్రేమికుల రోజు వచ్చిందట.. ఎంతో కాలంగా తమలో దాచుకున్న ప్రేమను.. వెల్లడించి.. కొత్త ప్రపంచంలో విహరించేందుకు.. మనసువిప్పి మాట్లాడుకునేందుకు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. ఇలా ఎన్నో జంటలు సిద్ధం అవుతున్నాయి.. అయితే, ప్రేమ ఒక మాయ. మనిషి తన జీవితంలో ఏ దశలోనైనా ఈ అనుభూతిని తప్పకుండా పొందేఉంటాడు. అది కొందరికి అమృతాన్ని ఇస్తే మరికొందరికి దుఃఖాన్ని మిగుల్చుతుంది.
Valentines Day: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తపరచుకునే ఈ ప్రత్యేక రోజును జంటలు తమ జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమయ్యే వాలెంటైన్స్ వీక్, ప్రేమికుల దినోత్సవం నాటికి ముగుస్తుంది. ఈ సందర్భాన్ని మనం స్వేచ్ఛగా ఆనందంగా జరుపుకున్నప్పటికీ, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ రోజు జరుపుకోవడం పూర్తిగా నిషేధించబడింది. ఆ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం పాశ్చాత్య సంస్కృతికి చెందినదిగా భావించడంతోపాటు,…