భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొండపై టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు క్యూ లైన్ విధానంలో, వసతుల కల్పనలో మార్పులు చేస్తూ వచ్చింది. 1985లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2001లో రెండో క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించింది. ఈ రెండు కాంప్లెక్స్‌లు చాలకపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో 2014లో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. 2019లో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చింది.