బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో భారీ శతకం బాదాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సులతో 143 రన్స్ చేశాడు. 52 బంతుల్లోనే సెంచరీ చేసి.. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో శతకం కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో వైభవ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. సెంచరీలతో సత్తాచాటుతున్న వైభవ్..…