ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. అలాగే కేంద్రం పరిధిలోనే వ్యాక్సిన్ ప్రక్రియ ఉండనున్నట్లు తెలిపారు. కరోనాను అంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన…
మంత్రి కేటీఆర్ పై బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కేటీఆర్ కు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? అని ప్రశ్నించారు రాములమ్మ. వ్యాక్సిన్ అనేది గంటలలోనో… రోజులలోనో… ఉత్పత్తి అయి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదని… అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి సరైన విజ్ఞత లేదని…
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి…నిర్లక్ష్యాన్ని కేంద్రంపై మోపుతున్నారని… కేటీఆర్ కళ్లు ఉన్నోడు అయితే ఇలాంటి విషం చిమ్మడని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే కుళ్లు మనస్తత్వం కేటీఆర్ ది అని.. భారత్ బయోటెక్ ను వాళ్ళు విజిట్ చేశారా.. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసారా? అని నిలదీశారు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. ట్విట్టర్ మంత్రిగా మారిపోయారు… హైటెక్ మంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నాడని..…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన వారికి ప్రధాన్యత ఇస్తున్నారు. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతున్నది. 17 లక్షల మంది జనాభా కలిగిన నగరంలో కేవలం ఇప్పటి వరకు 3.08 లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే జనాభాలో 20శాతం…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా వ్యాక్సిన్‌లను పోందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బందికి వ్యాక్సిన్‌లను అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారంలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హై ఎక్స్ పోజర్ కేటగిరీలో ఉన్న 12…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న సమయంలోనే.. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి… ఇక, థర్డ్ వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న ముందస్తు హెచ్చరికలతో.. చిన్నారులు కోవిడ్ బారినపడితే.. ఎలా అనేదానిపై ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి.. మరోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ సమయంలోనే పెద్ద ఎత్తున చిన్నారులు కూడా మహమ్మారి బారినపడ్డారు. మరోవైపు.. కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వాక్సినేషన్.. కానీ, భారత్ ఇప్పటి…
వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు కేవలం దేశంలో 4 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారని, ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణలోని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, 7 వతేదీన గాంధీభవన్ తో పాటు, జిల్లా కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంత వరకు…
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని తీసుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురౌతాయో అని భయపడుతున్నారు. దీంతో ముందుకు రావడంలేదు. యువతకు వ్యాక్సిన్ వేయించేందుకు అధికారులు, సామాజిక సంస్థలు అనేక తంటాలు పడుతున్నాయి. చెన్నై శివారు ప్రాంతమైన కోవలం గ్రామంలో 14,300 మంది మత్య్సకారులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వ్యక్తులు 6వేలకు పైగా ఉన్నారు. వీరిలో మొదట 58 మంది మాత్రమే టీకా…
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‌లతో పాటుగా విదేశీ వ్యాక్సిన్లకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చే ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫైజర్, మోడెర్నా టీకాలు కూడా ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఈ టీకాలు నష్టపరిహారంపై రక్షణ కోరుతున్నాయి. ఇలాంటి రక్షణ ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రావడంతో సీరం సంస్థకూడా తమకు ఇలాంటి రక్షణ ఇవ్వాలని కోరుతున్నది. టీకా తీసుకున్న వ్యక్తి దుష్ప్రభావాలకు గురైనపుడు టీకా సంస్థలు నష్టపరిహారం…
కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలుచేస్తున్నారు. లాక్‌డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో లాక్‌డౌన్ ను ఎత్తివేయాలని రాష్ట్రాలు చూస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ ఎత్తివేతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికోసం మూడు అంశాల ప్రణాళికను వెల్లడించింది. తక్కువ పాజిటివిటి రేటు, అత్యధిక మందికి టీకాలు, కోవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తనల వంటి అంశాలను…