దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తరువాత దేశంలో కేసులు 60 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే, అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాలో కోవావ్యాక్స్ పేరుతో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ తయారు చేస్తున్నది. మూడో దశ ట్రయల్స్ లో 90శాతానికి పైగా సమర్ధత ఉన్నట్టు రుజువైంది. ట్రయల్స్ పూర్తిచేసుకొని అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తే డిసెంబర్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ఉదయం ఏపీకి మరో 3.60 లక్షల కోవీషీల్డ్ డోసులు గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్డ్‌కు చేరుకున్న డోసులను గన్నవరం వ్యాక్సిన్ నిల్వ…
దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. అవసరాల తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. మూడో విడత కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్స కు…
గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంత వరకు కంట్రోల్ కాలేదు. ఇక ఇండియాలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 130 కోట్లమంది ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలంటే చాలా సమయం పడుతుంది. అవకాశం ఉన్నా కొందరు భయాలతో, అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు. పైగా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు వారికి కరోనా సోకిందని, చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీంతో పెళ్లి…
ప్రస్తుతం దేశంలో రెండోదశ కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ సంస్థ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలియజేసింది. కరోనా వైరస్‌లో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్‌లు వస్తే అవి వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా వైరస్‌ల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వైరస్ కట్టడికి సంబందించిన నిబంధనలను తూచా తప్పకుండా…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది.. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి ధరలను ఖరారు చేసింది.. అయితే, ఇవి ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకునేవారికి మాత్రమే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కొత్త వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది కేంద్రం… త్వరలో బయోలాజికల్-ఈ నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది… ఇప్పటి…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు కొన్ని దేశాలకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ సమస్య అధికంగా ఉన్నది. కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అధికారులు, వ్యాపాదవేత్తలు, సామాజికవేత్తలు వ్యాక్సినేషన్ కోసం భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు కడ్డీలు ఇస్తామని, మిలియన్ డాలర్ల నగదును అందజేస్తామని ప్రకతిస్తున్నారు.…
శ్రీకాకుళం జిల్లాలో నేడు ఐదు సంవత్సరాల లోపు బిడ్డలున్న తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనుంది. కాగా విదేశాల్లో చదువు, ఉద్యోగం నిమిత్తం వెళ్లేవారికి సైతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందించనున్నారు. సంబంధిత పత్రాలు చూపించిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విదేశాలకు వెళ్లేవారికి శ్రీకాకుళం నగరపరిధిలోని దమ్మలవీధి పట్టణ ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోను అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ,…
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాల్లో నిబంధనలను సడలిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోవైపు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రయను వేగ వంతం చేస్తున్నారు. అంతేకాదు, జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ఆందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్దమైంది. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కనీసం రెండు నెలలపాటు నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా వేవ్‌లు రాకుండా ఉంటాయని, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం…