కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు.…