కరోనా వీరవిహారం చేస్తోంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కరోనా బాధితులకు శాపం కానుంది. సిద్దిపేట పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మూడవ వార్డులో యువజన సంఘల సభ్యులు వ్యాక్సిన్ వేసుకోని వారి ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించడం కనిపించింది. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దంటున్నారు అధికారులు. తెలంగాణలో కరోనా మొదటి డోస్ సుమారుగా వంద శాతం పూర్తయింది. రెండో డోస్ వేయించుకోవడానికి జనం సిద్ధం అవుతున్నారు. కొంతమంది యువత వ్యాక్సిన్ పట్ల…
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ నెమ్మిదిగా సాగుతుంది. ఇక ఈరోజు నుండి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ కోసం వచ్చే విద్యార్థులు పాస్ పోర్ట్, వీసాలు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. అయితే నారాయణగూడ ఐసీఎం ఆవరణలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనున్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్న విషయం తెలిసిందే. రోజుకు రెండు వేలకు పైగా కరోనా కేసులు…