దేశంలో వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 28,87,66,201 మందికి వ్యాక్సిన్ అందించారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన యువతకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. జనాభా, వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రాతిపథకన రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే, జూన్ 21 వ తేదీన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇక్కరోజులో 16,73,858 మందికి వ్యాక్సిన్‌ను అందించింది. …