Ashwini Dutt: టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అంశంపై వివాదం నడుస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో నిర్మాతల శ్రేయస్సు కోసమే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైంది కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదని అశ్వినీదత్ ఆరోపించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని కొందరు నిర్మాతలే కారణమని.. వాళ్లకు ఇష్టం వచ్చినప్పుడు టిక్కెట్ రేట్లు పెంచి.. కష్టం వచ్చినప్పుడు తగ్గించాలని కోరడంతోనే అసలు సమస్య…