తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ.. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతలెవరూ హైదరాబాద్‌లో ఉండొద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని చెప్పిన ఆయన.. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యే తిరగాలని సూచించారు. కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి మాటలతో సరిపెట్టుకుండా.. నేతలందరూ…