టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ ఇటీవలే కన్నుమూశారు. కొన్నిరోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె మరణించారు. ఇవాళ ఉత్తేజ్ భార్య పద్మ సంస్మరణ సభ హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్‌సీసీ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తేజ్ కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యి ఉత్తేజ్‌ను ఓదార్చారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, నాగబాబు, శ్రీకాంత్, మురళి మోహన్, రాజశేఖర్, హేమ, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా ఎంతో…