Ankita Bhandari Case: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంకితా భండారీ హత్య కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత కుమారుడి రిసార్టులో పనిచేస్తున్న అంకితాను హత్య చేశారు. ఈ హత్యలో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కీలక నిందితుడిగా ఉన్నారు. దీంతో శుక్రవారం వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అంకితా భండారీ స్నేహితులను పోలీసులు విచారించగా వారు సంచలన విషయాలను బయటపెట్టారు.
ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ రిసార్టులో అంకితా బండారీ అనే 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య ప్రకంపనలు రేపుతోంది. రిసార్టు యజమానే మరో ఇద్దరితో కలిసి రిసెప్షనిస్టును హత్య చేసినట్లు తేలింది. రిసార్టు యజమాని రాష్ట్ర బీజేపీ నేత కొడుకు కావడంతో ఈ ఘటన దేశమంతటా సంచలనంగా మారింది.
Uttarakhand Girl Assassination Case: ఉత్తరాఖండ్ లో అంకితా బండారీ అనే 19 ఏళ్ల యువతి హత్య ప్రకంపనలు రేపుతోంది. ఈ హత్య వెనక బీజేపీనేత కుమారుడి హస్తం ఉండటంతో రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశం అయింది. యువతి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రిసార్టులను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు
ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే అంకితా భండారీ హత్యకు గురైంది. ఆమెను కొండ పైనుంచి నదిలోకి తోసేశారు.
Asaduddin Owaisi on survey of Madrasas in UP, Uttarakhand: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావాలనే ముస్లిం సమాాజాన్ని టార్గెట్ చేస్తున్నాయంటూ.. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మదర్సాలపై సర్వే నిర్వహిస్తున్నాయి. దీన్ని అసదుద్దీన్ వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చర్య ఉందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
Dalit man killed by in-laws for marrying upper-caste woman: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పరవు హత్య జరిగింది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అమ్మాయి తల్లిదండ్రులే ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కర్రలతో కొట్టి దారుణంగా యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు.. పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ తన ఐదుగురు కుటుంబ సభ్యులను చంపేశాడు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా రాయ్‌పూర్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు రాయ్‌పూర్ బ్లాక్‌లో సర్ఖేత్ గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించినట్లు స్థానికులు వెల్లడించారు. వరదలు ఆ గ్రామాన్ని అల్లకల్లోలం చేశాయి.