Peddi Sudarshan Reddy: అసలు అవగాహనే లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లకు.. కుంభకోణం లో వున్నా ఉత్తమ కుమార్ రెడ్డి జైలు కి వెళ్లడం ఖాయం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2026 మార్చిలో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సోనియా గాంధీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని, ప్రతీ ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. 1.81 లక్షల నిధులు కేసీఆర్ హాయంలో ఖర్చుపెట్టారని, 14వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో…
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడం ప్రాధాన్యతను వివరించారు.…
సచివాలయంలో జలాశయాల పూడిక తీత పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. చైర్మన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాలికతో…
ఈనెల 15న సీతారామ ప్రాజెక్టులోని 3 పంపులను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15కు పూర్తి చేయబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని, ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఇరిగేషన్ శాఖకు ఖర్చు చేసి నామమాత్రంగా పనులు చేశారని, కాళేశ్వరంకు లక్ష కోట్లు…
ప్రారంభోత్సవానికి సీతారాం ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్‌లు సిద్దంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆగస్ట్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవమని, ఈ ఆదివారం రోజున ట్రయిల్ రన్ కు ఏర్పాట్లు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సీతారామ ప్రాజెక్ట్ అనుమతులు చేరాయి. సీతారామ…
నీటి పారుదల ప్రాజెక్టులలో పూడిక తీత అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా.. సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. కూలిన రిటైనింగ్ సైడ్వాల్ను పరిశీలించారు. నీట మునిగిన ఇన్‌టెక్ వెల్, పంపింగ్ స్టేషన్‌ను మంత్రులు పరిశీలించారు.
Sunkishala Project: నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీని పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సబ్‌కమిటీలో పౌరసరఫరాలు & నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ సబ్‌కమిటీకి…