Donald Trump: భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా నిధులను ఉపయోగించిందని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) అందించినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అగ్గిరాజేశాయి. యూఎస్ఎయిడ్ నిధుల్ని కాంగ్రెస్, దాని ఎకోసిస్టమ్ వాడుకుందని బీజేపీ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించింది.