Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్‌బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు.
భారత్‌లో అమలవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అమెరికా గాయని మేరీ మిల్బెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. విశ్వాసం కారణంగా చిత్రహింసలకు గురైన ప్రజల పట్ల ప్రధాని మోడీ దయతో కూడిన దృక్పథాన్ని అవలంబిస్తున్నారని, వారికి భారత్‌లో నివాసం కల్పిస్తున్నారన్నారు.
Mary Millben: యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు రేపు జరగబోయే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. రేపు అయోధ్యంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు, సాధువులు 7000 మంది వరకు హాజరవుతున్నారు. లక్షల్లో ప్రజలు ఈ వేడుకను చూసేందుకు అయోధ్య చేరుకుంటున్నారు.